Page Loader
ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం 
ఎన్టీఆర్ 30 సినిమాకు వస్తున్నా అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు

ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 11, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు ఖతర్నాక్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను ఎన్టీఆర్ 30 సినిమాకు టైటిల్ గా నిర్ణయించాలని చిత్రబృందం భావిస్తుందట. అప్పుడప్పుడు దైర్యానికి కూడా తెలియదు, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండకూడదని, అప్పుడు భయానికి కూడా తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని.. అంటూ చివర్లో వస్తున్నా అని అంటాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 అనౌన్స్ మెంట్ వీడియోలోని వస్తున్నా అనే మాట బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడిదే మాటను సినిమా టైటిల్ గా ఫిక్స్ చేద్దామని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయని టాక్.

Details

ఇతర భాషలకు ఇతర టైటిల్స్ 

మరి, వస్తున్నా అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తారా లేదంటే మరో టైటిల్ ని వెతుకుతారా అనేది చూడాలి. ఒకవేళ వస్తున్నా ఫిక్స్ అయితే ఇతర భాషల్లో వస్తున్నా అన్న మీనింగ్ వచ్చే టైటిల్ ని పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో చిత్రబృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ 30 సినిమా, ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని కొరటాల శివ తెలియజేసాడు. ఇదివరకెప్పుడూ చూడని ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయని అన్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు పరిచయం అవుతోంది. అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, యువసుధ ఆర్ట్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.