ఎన్టీఆర్ బర్త్ డే: ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి డ్యాన్సర్ గా పేరున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. పెద్దగా ప్రాక్టీసు చేయకుండానే కష్టతరమైన స్టెప్పులను ఈజీగా నేర్చేసుకుంటారని కొరియోగ్రాఫర్ ఎన్టీఆర్ గురించి చెబుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లోని అదిరిపోయే స్టెప్పులున్న పాటల గురించి మాట్లాడుకుందాం. కూచిపుడి కైనా పాట - స్టూడెంట్ నంబర్ వన్: ముందుగా ఈ పాట గురించి తప్పకుండా మాట్లాడాలి. ఈ పాట వచ్చే ముందు సీన్ లో డ్యాన్స్ చేయమని ఎన్టీఆర్ ని బలవంత పెడతారు. తనకు కూచిపూడి డ్యాన్స్ అయినా, కుంగ్ ఫూ అయినా వచ్చంటూ సాగుతుందీ పాట. ఈ పాటలోనే ఎన్టీఆర్ లోని డ్యాన్సర్ కనబడతారు.
రాఘవ లారెన్స్ తో సిగ్నేచర్ స్టెప్
నైరే నైరే పాట-ఆంధ్రావాలా ఈ పాట గురించి చెప్పగానే ఎవ్వరికైనా ఇందులోని సిగ్నేచర్ స్టెప్ గుర్తొస్తుంది. రాఘవ లారెన్స్ తో కలిసి ఎన్టీఆర్ వేసే స్టెప్పులు అదిరిపోతాయి. రాఖీ రాఖీ సాంగ్-రాఖీ రాఖీ సినిమా టైమ్ లో ఎన్టీఆర్ లావుగా ఉన్నారు. అయినా కూడా రాఖీ రాఖీ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు సూపర్ గా ఉంటాయి. నాచోరే నాచోరే-యమదొంగ ఈ పాటలో హీరోయిన్ రంభతో కలిసి స్టెప్పులు వేస్తాడు ఎన్టీఆర్. ఇందులో కనిపించే ఫ్లోర్ మూమెంట్స్ అప్పట్లో ప్రతీ ఒక్కరూ ట్రై చేసారు. నాటు నాటు-ఆర్ఆర్ఆర్: ఆస్కార్ అందుకున్న ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ దాకా ఈ పాట వెళ్లడానికి అందులోని డ్యాన్సే కారణం.