
NTR: ఎన్టీఆర్-హృతిక్ మాస్ స్టెప్పులు..? 'వార్ 2' స్పెషల్ సాంగ్‌కు లైన్ క్లియర్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు, హిందీ చిత్రసీమల ఇద్దరు అగ్రతారలు ఒకే ఫ్రేమ్‌లో పోరాటానికి దిగితే ఎలా ఉంటుందో చూపించేందుకు 'వార్ 2' సిద్ధమవుతోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
కథానాయికగా కియారా అద్వాణీ ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
Details
జూన్ చివరి వారంలో చిత్రీకరణ
'నాటు నాటు' తరహాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి చేయనున్న ఒక ప్రత్యేక గీతం ఈ సినిమాలో ఉంటుందట. ఈ డ్యాన్స్ కోసం బృందం రెండు నెలలుగా సిద్ధమవుతుండగా, హృతిక్ గాయం కారణంగా చిత్రీకరణ వాయిదా వేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో, జూన్ చివరి వారంలో ఈ ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ఈ పాట కోసం యశ్ రాజ్ స్టూడియోలో భారీ సెట్‌ను వేయించారని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.