
NTR: ఎన్టీఆర్ నా ఫేవరెట్ కో-స్టార్.. హృతిక్ రోషన్ కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు కలసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2'(War 2)గురించి మాట్లాడుతూ, తాజా ఈవెంట్‌లో హృతిక్ ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని స్పష్టతనిచ్చారు.
తారక్‌పై ప్రశంసలు కురిపించిన హృతిక్, ''ఒక పాట మినహా 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ నాకు ఎంతో ఇష్టమైన సహనటుడు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది.
తారక్ గొప్ప నటుడు, అద్భుతమైన టీమ్ ప్లేయర్. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని నమ్మకం ఉంది.
ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
Details
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన తొలి భాగం 'వార్' స్పై థ్రిల్లర్‌గా పెద్ద విజయాన్ని అందుకుంది.
దానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ 'వార్ 2' చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్‌లాంటి స్టార్ హీరోలు ఈజెంట్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.
అయితే ఎన్టీఆర్ పాత్ర ఈ చిత్రంలో మిగతావాటికన్నా భిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉండనుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.