LOADING...
NtrNeel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నీల్ మామ!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నీల్ మామ

NtrNeel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నీల్ మామ!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే సమాచారం అని చెప్పాలి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సినిమా మేకింగ్‌ను అత్యంత భారీ స్థాయిలో రూపొందించడం అని తెలుస్తోంది. ప్రారంభంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే చిత్ర నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమా పనులకు మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వివరాలు

అందుకే ఆలస్యం..

ఈ భారీ యాక్షన్ డ్రామా విడుదల తేదీ వచ్చే ఏడాదికి మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని 2027 మే 7న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆలస్యానికి ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సన్నివేశాల నిర్మాణంలో తీసుకుంటున్న సమయం కారణమని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలకు ప్రత్యేకమైన డార్క్ టోన్, భారీ ఎలివేషన్లు ఉండటం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్‌కు సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయి అవుట్‌పుట్ ఇవ్వాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement