NTR-Neel Project: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం.. యాక్షన్ మోత మొదలైంది!
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
గతేడాది ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినా చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైనట్లు ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
'భారతీయ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేలా ఈ మట్టి ఎట్టకేలకు తన పాలనను స్వాగతించింది.
ఎన్టీఆర్ - నీల్ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త యాక్షన్, వినోదం సిద్ధమవుతోందని చిత్రబృందం వెల్లడించింది.
Details
వచ్చే ఏడాది రిలీజ్
షూటింగ్ ప్రారంభాన్ని సూచిస్తూ ఓ ఫొటోను కూడా పంచుకుంది. ఇందులో ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తూ కనిపించారు. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రీకరణలో భాగం కాలేదని సమాచారం.
త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్‌గా రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నట్లు సమాచారం.
మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2026 జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.