LOADING...
NTR 31 : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సర్ప్రైజ్..! ఒకటి కాదు.. రెండు పార్ట్స్‌గా గ్రాండ్ ప్లాన్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సర్ప్రైజ్..! ఒకటి కాదు.. రెండు పార్ట్స్‌గా గ్రాండ్ ప్లాన్

NTR 31 : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సర్ప్రైజ్..! ఒకటి కాదు.. రెండు పార్ట్స్‌గా గ్రాండ్ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డ్రాగన్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లో ఇప్పటికే కొంత భాగం షూట్‌ పూర్తయింది. ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లో 31వ చిత్రం. ఇక మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందని, హీరో-దర్శకుడి మధ్య విభేదాలు వచ్చాయని, ప్రశాంత్‌ నీల్‌ తీసిన అవుట్‌ఫుట్‌పై ఎన్టీఆర్‌ సంతృప్తిగా లేడని, అందుకే ప్రాజెక్ట్‌ స్క్రాప్‌ అయిందని పుకార్లు గట్టిగా వినిపించాయి.

Details

ఎన్టీఆర్ సరికొత్త లుక్

అంతేకాదు, కథలో మార్పులు చేయమని ఎన్టీఆర్‌ సూచించాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ పూర్తిగా వట్టి వదంతులే అని తేలింది. తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఊహించని రీతిలో డ్రాగన్‌ ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ మళ్లీ ప్రారంభించారు. మొదట అనుకున్న కథకు స్వల్ప మార్పులు చేసి, ఎన్టీఆర్‌ను సరికొత్త లుక్‌, మాస్‌ ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇంకా ఈ సినిమాను రెండు భాగాలుగా (Part 1 & Part 2) తెరకెక్కించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది 'సలార్‌' తరహాలో రెండు వేరు సినిమాలుగా కాకుండా, రెండు భాగాలను ఒకేసారి షూట్‌ చేశారు.

Details

వేగంగా స్క్రీప్ట్ వర్క్

మొదటి పార్ట్‌ విడుదలైన నెల రోజుల్లోనే రెండో పార్ట్‌ను రిలీజ్‌ చేసే విధంగా భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. మొదటివిడత స్క్రిప్ట్‌ దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండటంతో, కథను రెండు భాగాలుగా విభజించాలని ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మేరకు స్క్రిప్ట్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది. ఆగిందనుకున్న డ్రాగన్‌ ఇప్పుడు మరింత భారీగా, దుమ్మురేపే రీతిలో రాబోతోంది.