LOADING...
Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ భారీ కాంబో.. 'డ్రాగన్'లో హీరోయిన్ ఫిక్స్!
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ భారీ కాంబో.. 'డ్రాగన్'లో హీరోయిన్ ఫిక్స్!

Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ భారీ కాంబో.. 'డ్రాగన్'లో హీరోయిన్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా 'డ్రాగన్' (NTR31)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అధికారికంగా ప్రకటించిన నాటి నుంచే ఫ్యాన్స్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అధికారికంగా ధృవీకరించారు. హీరో శివకార్తికేయన్ నటించిన 'మదరాసి' సినిమాకు ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ రుక్మిణీ వసంత్ అప్‌కమింగ్ సినిమాల జాబితాను వెల్లడించారు.

Details

కీలక పాత్రలో అనిల్ కపూర్

'మదరాసి'లో రుక్మిణీని ఎంపిక చేసినప్పుడు ఆమె కొత్త హీరోయిన్. కానీ ఇప్పుడు 'కాంతార 2'లోనూ ఆమెనే, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనూ ఆమెనే, అలాగే 'టాక్సిక్'లోనూ హీరోయిన్ రుక్మిణీ వసంతే. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడ్డారు. త్వరలోనే 'కాంతార 2' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. దీంతో 'డ్రాగన్'లో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్న విషయం అధికారికమైంది. 'కేజీయఫ్', 'సలార్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో అలరించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈభారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కర్ణాటకలో ఒక కీలక షెడ్యూల్ పూర్తి కాగా, ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.