Page Loader
NTR Neel Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

NTR Neel Movie: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి విడుదల తేదీ లాక్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 29, 2025
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ - 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ 31వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.

Details

వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్

తాజాగా మేకర్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా జూన్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ ఇప్పటికే పాల్గొనగా, ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించనుండగా, ప్రశాంత్ నీల్ మాస్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీపై మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.