NTRNeel : ఎన్టీఆర్ 'డ్రాగన్'పై పుకార్లు.. షూటింగ్ ఆగలేదు అంటున్న మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్‌లో మార్పులు చేస్తున్నారనే కారణంతో షూటింగ్ షెడ్యూల్స్ రద్దయ్యాయని వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన రేపాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ షెడ్యూల్స్ రద్దయ్యాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని, ఒక షెడ్యూల్ పూర్తయ్యాక మరో షెడ్యూల్ ప్రారంభానికి మధ్య ఉండే సాధారణ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే ప్రస్తుతం ఉందని తెలిపారు.
వివరాలు
కేరళ యుద్ధ విద్య కలరిపయట్టులో ఎన్టీఆర్ శిక్షణ
ఎన్టీఆర్ లుక్ మార్పులు లేదా షూటింగ్ వాయిదా గురించి వస్తున్నసమాచారం పూర్తిగా అసత్యమని వెల్లడించారు. అదేసమయంలో,అనధికారిక సమాచారం సోషల్ మీడియాలో పంచుకోవద్దని,అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మకూడదని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. సినిమా సంబంధిత ప్రతి అప్‌డేట్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ప్రకటిస్తామని, అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాలని కోరింది. ఇక ఈ సినిమాకోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కేరళకు చెందిన యుద్ధ విద్య కలరిపయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసిన టీమ్,తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్స్ సిద్ధం చేస్తోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్,ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలయికతో ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని ఇండస్ట్రీవర్గాల్లో చర్చ సాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come…
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2026