NTR: ఎన్టీఆర్ ఆఫ్రికా షెడ్యూల్ ఫిక్స్.. భారీ షెడ్యూల్ కోసం అక్కడే క్యాంప్!
ఈ వార్తాకథనం ఏంటి
'దేవర' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా రాకపోయినా, ప్రస్తుతం ఆయన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తయారవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఎన్టీఆర్ పూర్తి ఫోకస్ పెట్టాడు. లుక్ విషయంలో కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నాడు. ఫలితంగా ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగా, సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. ఇక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.
Details
డ్యూయల్ రోల్‌లో ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్ స్టైల్‌కు తగ్గట్టుగానే పక్కా మాస్, స్టైలిష్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందుతుందని టాక్. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్‌ను మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా బజ్ ప్రకారం—ఇప్పటివరకు భారత్‌లోని పలు లొకేషన్స్‌లో షూట్ చేసిన టీమ్ త్వరలోనే ఆఫ్రికాకు వెళ్లనుందట. ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన పెద్ద షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్. అంతేకాక, ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడన్న వార్త కూడా గట్టిగానే వినిపిస్తోంది.
Details
తర్వాత లండన్ షెడ్యూల్
అందులో ఒకటి తండ్రి పాత్ర అని, ఆ పవర్‌ఫుల్ పాత్రకు సంబంధించిన కీలక సీన్స్ అన్నీ ఆఫ్రికాలో చిత్రీకరిస్తున్నారట. ఆఫ్రికా షెడ్యూల్ పూర్తయ్యాక టీమ్ లండన్‌కు వెళ్లనుంది. అక్కడ కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తారు. ఈ రెండు షెడ్యూల్స్‌తో సినిమాలోని ఎక్కువ భాగం కంప్లీట్ అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.