LOADING...
Swayambhu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..? 
పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..?

Swayambhu : పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభు'లో ఎన్టీఆర్ ఎంట్రీ..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నుంచి వచ్చే భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ 'స్వయంభు'. ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ విజువల్ వండర్‌లో సంజుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకు 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్‌ను సమకూర్చుతున్నారు. పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది.

Details

హిందీ వర్షన్ కోసం అజయ్ దేవగణ్ ను సంప్రదిస్తున్నట్లు వార్తలు

తాజాగా సినిమా స్థాయిని మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కీలక పాత్రలను కథా నేపథ్యాన్ని వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేయడానికి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను మేకర్స్ కోరారు. ఇది తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ వర్షన్ కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌ను కూడా సంప్రదిస్తున్నారని వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్‌ల వాయిస్‌తో 'స్వయంభు' పాన్ ఇండియా లెవల్లో భారీ ప్రభావం చూపగలదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement