Page Loader
Devara:'దేవర' షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్ 
Devara: 'దేవర' షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్

Devara:'దేవర' షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్ 

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని వారాలుగా గోవాలో జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ గోవాలో డ్యాన్సర్లతో ఫొటోలు దిగారు. డ్యాన్సర్లతో రకరకాల స్టిల్స్‌తో ఆయన దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దేవరలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండటం గమనార్హం. దేవర మూవీని 2024 ఏప్రిల్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డ్యాన్సర్లతో ఎన్టీఆర్ దిగిన ఫొటోలు