నాటుకోడి పులుసును బహుమతిగా పంపిన ఎన్టీఆర్: సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
బాహుబలి సినిమా స్ఫూర్తితో చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చాయి. అందులో ఒక్కగానొక్క సినిమా మాత్రమే బాహుబలిని దాటేస్తుందా అన్న అనుమానాలను కలిగించింది. అదే కేజీఎఫ్.
కన్నడ సినిమా పరిశ్రమలో వందకోట్ల వసూళ్ళు రావడమే కష్టం అనుకుంటున్న సమయంలో వెయ్యికోట్ల వసూళ్ళను రప్పించగలిగింది కేజీఎఫ్. దానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్.
నిన్న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అన్ని పరిశ్రమల నుండి ప్రశాంత్ నీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం, తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేసి, బహుమతి కూడా పంపాడు. ప్రశాంత్ నీల్ కు నాటు కోడిపులుసును బహుమతిగా పంపాడు ఎన్టీఆర్.
Dtails
ఇంటర్నెట్ లో షేర్ చేసిన ప్రశాంత్ నీల్ సతీమణి
బర్త్ డే బహుమతిగా నాటుకోడి పులుసు పంపిన విషయాన్ని ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి వెల్లడి చేసారు. నాటు కోడిపులుసు ఫోటోను ఇంటర్నెట్ లో షేర్ చేస్తూ, థ్యాంక్యూ అన్నయ్య అని రిప్లై ఇచ్చారు లిఖిత రెడ్డి.
ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ బహుమతి సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పనిచేస్తున్న సలార్ పూర్తయితే ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా మీద వర్కౌట్ చేస్తాడట ప్రశాంత్ నీల్.
ఇటువైపు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.