
NTR: యూఎస్ కాన్సులేట్‌లో మెరిసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల 'వార్ 2'తో ప్రేక్షకులను కలిసిన ఎన్టీఆర్, ఆ చిత్రం ఊహించినంతగా రాణించకపోయినా, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో షూటింగ్ జరిపిన ఈ ప్రాజెక్ట్, త్వరలో అమెరికాలో కీలక షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించేలా, ఇటీవల ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని US కాన్సులేట్‌ను సందర్శించాడు. అనంతరం అమెరికా కాన్సుల్ జనరల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.
Details
అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు
ఆ పోస్ట్‌లో ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో తన రాబోయే సినిమాకి సంబంధించిన షూటింగ్ జరపనున్నారు. ఈ సందర్భంగా అమెరికా-ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ఉద్యోగావకాశాల పెంపులో, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలలో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ టైటిల్‌గా 'డ్రాగన్' అనే పేరు వినిపిస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ వంటి అద్భుత నటుడితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Details
తొలిసారి తెలుగులో నటిస్తున్న రుక్మిణి
రుక్మిణి వసంత్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. అంతేకాకుండా, అమెరికాలో ప్రధానంగా షూట్ చేయబడుతున్న తొలి తెలుగు సినిమా కావడం మరో ప్రత్యేకత. రాజకీయ, వాణిజ్య సంబంధాల పరంగానూ ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీపై కూడా క్లారిటీ రానుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోయే ఈ సినిమా, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎలాంటి మాస్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.