LOADING...
JR NTR : 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం
'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం

JR NTR : 'ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కొత్త సినిమా'.. ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక అంచనాలుంటాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ విజయవంతమైన జంట మరోసారి కలవబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ విక్టరీ వెంకటేష్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకువెళ్లేందుకు నిర్మాత నాగవంశీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్‌ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులను ప్రారంభించాడు.

Details

త్రివిక్రమ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ

ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆయన తన టీమ్‌లో కీలక మార్పులు చేశాడు. ఇంతవరకు తనతో పనిచేసిన పాత రైటర్స్‌ టీమ్‌ను పక్కన పెట్టి, కొత్త రచయితలను తీసుకున్నాడు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా త్రివిక్రమ్‌ కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌గా, సాంకేతికంగా, కథాపరంగా కొత్త స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన త్రివిక్రమ్‌, ఈసారి మైథలాజికల్‌ జానర్‌లో అడుగుపెడుతున్నారు. దాంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈలోగా త్రివిక్రమ్‌, వెంకటేష్‌ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు.