Page Loader
Siima Awards 2023: సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్
సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్

Siima Awards 2023: సైమా అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2023
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సైమా అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో కన్నుల పండువగా సాగుతోంది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరయ్యారు. టెండ్రీ దుస్తుల్లో హజరైన తారలు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఇక వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్‌గా నటనకు గాను సైమా-2023 బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు.

Details

తెలుగులో సైమా అవార్డ్స్ వీరికే

ఈ ఏడాది సైమా విజేతలు వీరే ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్) ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా) ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతీ మూవీస్) ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్) ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2) ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2) ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ సంగీత దర్శకుడు: కీరవాణి(ఆర్ఆర్ఆర్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్ కుమార్(ఆర్ఆర్ఆర్) ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు) ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు) సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ (కార్తికేయ2) ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్)