Page Loader
Devara Trailer: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్
ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్

Devara Trailer: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'దేవర' ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (సెప్టెంబర్ 10) విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదలకు సమయాన్ని ఖరారు చేసింది. రేపు సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్' అని తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్,కొరటాల శివ కాంబోలో రూపొందిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' రెండు భాగాలుగా విడుదల కానుంది.

వివరాలు 

ఈ సినిమాలో విలన్‌గా సైఫ్ అలీఖాన్

ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, చిత్ర బృందం ఇప్పటికే పాటలను విడుదల చేసింది. ఇప్పుడు ట్రైలర్‌ను కూడా సమయం నిర్ణయించారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. 'దేవర' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్