O..! Sukumari Trailer: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ.. ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' ట్రైలర్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన 'ఓ..! సుకుమారి' సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రొమాన్స్, కామెడీ, పల్లెటూరి నేపథ్యంతో రూపొందించారు. రచయిత-దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ సినిమాను, 'శివం భాజే' విజయానంతరం గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
వివరాలు
ట్రైలర్ ఎలా ఉందంటే..
ట్రైలర్ కథ ప్రకారం.. దామిని అనే యువతిని గ్రామస్థులంతా దూరంగా ఉంటూ భయపడుతుంటారు. అందుకు కారణం ఆమెను ఎవరైనా తాకిన వెంటనే కరెంట్ షాక్ తగలడం. ఈ విచిత్రమైన నిజాన్ని రహస్యంగా ఉంచి ఆమెకు హీరోతో వివాహం జరిపిస్తారు. పెళ్లి అనంతరం అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ సమస్యను భార్యాభర్తలు కలిసి ఎలా అధిగమించారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, సంతోషం ఎలా నిలిచాయి? అనే అంశాల చుట్టూ సినిమా కథ సాగనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. ఈ విభిన్నమైన కథాంశాన్ని దర్శకుడు భరత్ దర్శన్ వినోదభరితంగా మలుస్తూనే భావోద్వేగాలను సమతూకంగా మేళవించినట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.
వివరాలు
జూలై 17న విడుదల..
'బలగం' చిత్రంతో గుర్తింపు పొందిన తిరుమల ఎం. తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేయగా, శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అను రెడ్డి అక్కటి కాస్ట్యూమ్స్‌ను రూపొందించగా, పాటలకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. మొత్తంగా చూస్తే.. కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'ఓ..! సుకుమారి' ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.