English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు 
    తదుపరి వార్తా కథనం
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు 
    డబుల్ ఇస్మార్ట్ షురూ

    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 10, 2023
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. రామ్ ని పూర్తి అవతార్ లో చూపించిన సినిమా అది.

    అయితే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని గతంలో పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమాను ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు.

    డబుల్ ఇస్మార్ట్ టీమ్, కొంతమంది అతిథులు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మీ, క్లాప్ కొట్టగా, మొదటి షాట్ కి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

    రెగ్యులర్ షూటింగ్ జులై 12నుండి మొదలవుతుందని, అలాగే 2024 మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 8న డబుల్ ఇస్మార్ట్ విడుదల అవుతుందని వెల్లడి చేసారు.

    Details

    పూరీ జగన్నాథ్ పూర్తి ఫోకస్ డబుల్ మీదే 

    లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేసిన జనగణమన సినిమాను కూడా పక్కన పెట్టేసారు.

    ప్రస్తుతం పూరీ ఫోకస్ మొత్తం డబుల్ ఇస్మార్ట్ మీదే ఉంది. ఇస్మార్ట్ శంకర్ కంటే ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ డబుల్ ఇస్మార్ట్ అందిస్తుందని పూరీ జగన్నాథ్ తెలియజేసారు.

    పూరీ కనెక్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

    ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా, ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకుంటుందో చూడాలి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ పోతినేని
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్
    Motivational: ఈ ఐదు రకాల మనుషులకు సలహాలు ఇవ్వొద్దు.. ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది! ప్రేరణ

    రామ్ పోతినేని

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్

    తెలుగు సినిమా

    30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ  సినిమా
    బ్రో టీజర్: తెరమీద మామా అల్లుళ్ళ హంగామా షురూ  పవన్ కళ్యాణ్
    హ్యాపీ బర్త్ డే అల్లరి నరేష్: కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల లిస్టు  పుట్టినరోజు
    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి

    సినిమా రిలీజ్

    హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే?  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  నాగ చైతన్య
    సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే?  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025