Page Loader
అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్ 
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్

అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 29, 2023
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

పుకార్లు వచ్చిన తర్వాతే సలార్ సినిమా అప్డేట్లు వస్తున్నాయి. సినిమా విడుదల తేదీ వాయిదా పడటం దగ్గరి నుండి ఇప్పుడు కొత్త విడుదల తేదీ ప్రకటించడం వరకూ అన్నీ అలాగే జరిగాయి. సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదల అవుతుందని కొన్ని రోజుల నుండి పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిని నిజం చేస్తూ సలార్ టీమ్, తమ కొత్త విడుదల తేదీని డిసెంబర్ 22గా ప్రకటించింది. ఈ మేరకు క్రేజీ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో రక్తంతో తడిచిన ప్రభాస్ కనిపిస్తారు. బ్లడ్ బాత్ అంటే ఇదేనేమో అన్నట్టుగా ఆ పోస్టర్ ఉంది. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సలార్ విడుదల తేదీపై నిర్మాణ సంస్థ ట్వీట్