
Pawan Kalyan : ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇక రికార్డులు బద్దలుకొట్టే టైమ్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'ఓజీ' (OG)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు లీక్ అవుతున్నప్పుడల్లా సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. OG ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
Details
29 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. అయితే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా హంగామా కాస్త ముందుగానే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ రిలీజ్ దృష్ట్యా, ఈ నెల 29 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడబోతామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ రైట్స్‌ను ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అంతేకాక అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే పవన్ కళ్యాణ్ గత రికార్డులను బద్దలు కొట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇక ప్రీమియర్స్ నాటికి ఎంత భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడతాడో చూడాల్సి ఉంది.