Pawan Kalyan: 'ఓజీ' హిట్ ఎఫెక్ట్.. దర్శకుడికి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
'ఓజీ' దర్శకుడు సుజీత్ (Sujeeth)కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ప్రత్యేకమైన బహుమతి అందింది. సుజీత్‌కు పవన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ గారికి అభిమానిని. అలాంటి వ్యక్తి నుంచి నాకు ఇలా గిఫ్ట్ అందడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని క్షణం. 'ఓజీ' పవన్ కల్యాణ్ గారి ప్రేమ, ప్రోత్సాహం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని సుజీత్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ లగ్జరీ కార్ ధర రూ. కోటికి పైగానే ఉంటుందని సమాచారం.
Details
నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓజీ' స్ట్రీమింగ్
పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలను సుజీత్ షేర్ చేయగా, అవి నెట్టింట వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాబోయే సినిమా కోసమే పవన్ హెయిర్‌స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. 'ఓజీ' చిత్రంతో పవన్-సుజీత్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. అభిమానులు చాలా కాలంగా పవన్‌ను తెరపై ఎలా చూడాలనుకున్నారో అదే స్థాయిలో చూపించి సుజీత్ మెప్పించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన 'ఓజీ' ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Details
పవన్ కళ్యాణ్ లుక్ వైరల్
ఇక 'ఓజీ'కు ప్రీక్వెల్, సీక్వెల్ రూపొందించే ఆలోచన ఉందని సుజీత్ గతంలో వెల్లడించారు. మరోవైపు, 'ఓజీ' విడుదలకు ముందే నాని హీరోగా ఓ కొత్త సినిమాను ప్రకటించిన సుజీత్ ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తాజా లుక్ మరో మూవీ కోసమేనని సమాచారం.