ఓజీ గ్లింప్స్ విడుదల సమయంపై నిర్ణయం అభిమానులదే: నిర్మాణ సంస్థ బంపరాఫర్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు అందరూ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున(సెప్టెంబర్ 2) గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది కూడా.
తాజాగా గ్లింప్స్ విడుదల సమయంపై ఓజీ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ఓజీ గ్లింప్స్ ఏ సమయంలో విడుదల చేయాలో అభిమానులను డిసైడ్ చేయమని కోరింది.
సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులు ఏ సమయంలో విడుదల చేయాలని ప్రతిపాదిస్తే ఆ సమయంలో విడుదల చేస్తామని ఓజీ మేకర్స్ తెలిపారు.
ఈరోజు సాయంత్రంలోగా అభిమానుల సలాహాలు పరిశీలించి, గ్లింప్స్ విడుదల ఏ సమయంలో ఉంటుందో తెలియజేయనున్నారు.
డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్
Aaaroju anthaa Pandage kaaabatti… Meere Cheppandi… Sept 2nd ye time ki cheddaamo..:)
— DVV Entertainment (@DVVMovies) August 31, 2023
Eeroju Evening ki final ga oka time fix avudaaam fans andari response chusi. #HUNGRYCHEETAH #TheyCallHimOG https://t.co/VJon3wHY6J