
ఓజీ నుండి సాలిడ్ అప్డేట్: కీలక పాత్రలో శ్రియా రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఓజీ సినిమా షూటింగ్ పనులు చకచకా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది.
ఓజీ సినిమాలో శ్రియా రెడ్డిని తీసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించిన శ్రియా రెడ్డి తెలుగులో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు.
అయితే శ్రియా రెడ్డిని నెగెటివ్ రోల్ కోసం తీసుకుంటున్నారని వినపడుతోంది. గతంలో విశాల్ నటించిన పొగరు సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించింది శ్రియా రెడ్డి.
మరి ఓజీ సినిమాలో శ్రియా పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓజీ సినిమాలో శ్రియా రెడ్డి
Welcome aboard, @SriyaReddy!
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59