
OG: 'ఓజీ' మూవీ తొలి టికెట్.. లక్షకు కొన్న అభిమాని
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమాకు ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు తర్వాత పవన్ నటించిన ఈ సినిమా పై అభిమానుల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొన్నది. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలు, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ బజ్‌ను సృష్టించాయి. సెప్టెంబర్ 25న *ఓజీ* గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనము కూడా వెలువడ్డింది. చిత్తూరు జిల్లాలోని రాఘవ్ థియేటర్‌లో ఒక యువకుడు 'ఓజీ' సినిమా తొలి టికెట్‌ను అక్షరాల లక్ష రూపాయలకు కొన్నాడు.
Details
ఆ డబ్బును గ్రామాభివృద్ధి కోసం వినియోగించాలి
ఆ లక్ష రూపాయలను పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఈ డబ్బును గ్రామ అభివృద్ధికి ఉపయోగించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ అభిమాని శ్రీరామ్‌లోచన్‌ను పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. టికెట్ కొనడమే కాక, డబ్బును మంచి విధంగా వాడాలని నిర్ణయించడమే హర్షణీయమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. నిర్మాతల విజ్ఞప్తి మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోస్‌కు కూడా పర్మిషన్ ఇచ్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా 'ఓజీ' ప్రీమియర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కల్పించింది.