
OG : 'ఓజీ' ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు సాధించిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సుజిత్ దర్శకత్వంలోని ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా మెరిశాడు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అందాన్ని చల్లి సినిమాకు అదనపు ఆకర్షణను ఇచ్చింది.అలాగే థమన్ బీజీఎం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ కారణంగా అభిమానులు మాత్రమే కాక సామాన్య ప్రేక్షకులు కూడా 'ఓజీ'ను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. కలెక్షన్ల పరంగా, విడుదలైన మొదటి రోజే 154 కోట్ల వసూళ్లతో సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. నాలుగు రోజులలో మొత్తంగా 252 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
Details
ఓవర్సీస్ లోనూ రికార్డులు
ఆకాశాన్నే టచ్ చేసిన కలెక్షన్స్‌తో పాటు మూవీకి సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్ కూడా విడుదలైంది. పాన్ ఇండియా పరిధిలో విడుదలైన 'ఓజీ' ఓవర్సీస్‌లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ట్రేడ్ నిపుణుల ప్రకారం, అమెరికాలో ఇప్పటికే 5 మిలియన్ డాలర్ల (రూ. 40 కోట్లు) వసూళ్లు సాధించబడినట్లు వెల్లడయింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్‌లో 'ఓజీ' అతిపెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. '