LOADING...
OG: 'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!
'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!

OG: 'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' ఈ నెల భారీ హైప్‌తో విడుదలకు సిద్ధమై ఉంది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్ద అవరోధం ఏర్పడింది. ప్రముఖ థియేటర్స్ చైన్ అయిన యార్క్ సినిమాస్ OG సినిమాను తమ థియేటర్స్‌లో రిలీజ్ చేయమని ప్రకటించింది. ప్రెస్ నోట్‌లో ప్రేక్షకులకు OG సినిమా రాబోయే అన్ని షోస్ రద్దు చేయాలనే కఠిన నిర్ణయం యార్క్ సినిమాస్ తీసుకున్నట్లు తెలియజేస్తున్నాము. ఉత్తర అమెరికాలో సినిమా పంపిణీ విషయంలో కల్చరల్, రాజకీయ సంబంధాలు కారణమని, అందుకే ప్రేక్షకుల సురక్షత, సెక్యూరిటీ విషయంపై యార్క్ సినిమాస్ ఆందోళన చెందుతోంది.'

Details

 ఓవర్సీస్ 'OG' డిస్ట్రిబ్యూటర్ పై వ్యతిరేకత

అందువలన OG సినిమా షోలను రద్దు చేస్తున్నాం. ఈ అసౌకర్యానికి క్షమాపణలు, ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి పూర్తి రిఫండ్ అందిస్తాం. మా ఉద్యోగులు, ప్రజల భద్రత ప్రధాన ప్రాధాన్యత" అని పేర్కొన్నారు. అదనంగా, డిస్ట్రిబ్యూటర్‌ల తరఫున, నార్త్ అమెరికాలో OG సినిమాకు వచ్చే కలెక్షన్స్ పెంచాలని, తద్వారా భవిష్యత్ బిగ్ బడ్జెట్ సినిమాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని యార్క్ సినిమాస్‌కు రిక్వెస్టులు వచ్చాయని వివరించారు. అయితే ఈ వ్యక్తులు సామాజిక, రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, యార్క్ సినిమాస్ అటువంటి అనైతిక వ్యాపార పద్ధతులను ఒప్పుకోదని స్పష్టం చేశారు.

Details

తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

సౌత్ ఏషియన్ కమ్యూనిటీ అభివృద్ధికి మద్దతు ఇస్తూ ప్రోత్సహించే యార్క్ సినిమాస్, OG సినిమా సంబంధించి పంపిణీదారులు లేదా వారి ప్రతినిధులు చేసిన తప్పుడు ప్రకటనలను ఖండించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.