OG Universe: 'ఓజీ 2' నుంచి బిగ్ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అయితే 2025లో వచ్చిన 'ఓజీ' సినిమా మాత్రం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఆయన స్వాగ్, లుక్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.
వివరాలు
'ఓజీ యూనివర్స్'కు సంబంధించిన ఆసక్తికర విషయాలు..
ఇక 'ఓజీ' సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే హింట్ ఇచ్చారు.
సినిమా ఎండింగ్‌లో కూడా దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు.
తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఓజీ' దర్శకుడు సుజిత్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
'ఓజీ యూనివర్స్' నుంచి ఓ క్రేజీ వీడియోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
ఈ స్పెషల్ వీడియోలో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ కలిసి 'ఓజీ యూనివర్స్'కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
వివరాలు
'ఓజీ 2'పై భారీ అంచనాలు..
'ఓజీ' కథ కేవలం ప్రస్తుత కాలానికి మాత్రమే పరిమితం కాదని వారు తెలిపారు.
సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ కాలం నుంచి నేటి వరకు జరిగిన కీలక సంఘటనలను ఆధారంగా చేసుకుని 'ఓజీ యూనివర్స్'ను రూపొందించినట్లు వెల్లడించారు.
దీంతో 'ఓజీ యూనివర్స్' కథ, కథనం పరిధి చాలా పెద్దదిగా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ వీడియోతో 'ఓజీ 2'పై పవన్ ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
From the #OGUniverse
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
To the #OG…
ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️
Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk