Rakul Preet Singh: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి డేట్ ఎప్పుడంటే?
'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పెద్ద ఆఫర్లు లేకపోయినా హిందీలో మాత్రం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jackie Bhagnani)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గత మూడేళ్లగా ప్రేమలో ఉన్న త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఆంగ్ల వెబ్ సైట్స్ లో కథనాలు వెలువడ్డాయి.
జాకీ భగ్నానీతో రిలేషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంల వీరి పెళ్లి జరుగుతుందని, తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తమ పెళ్లి తేదీని ఈ జంట త్వరలోనే అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీటౌన్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో రకుల్ ప్రకటించింది. ప్రస్తుతం రకుల్ నటించిన 'అయాలన్' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.