Venkatesh: సంక్రాంతికి మరోసారి.. విక్టరీ వెంకటేష్ బిగ్ అనౌన్స్‌మెంట్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఘనవిజయం సాధించింది.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి తెలుగు రీజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
సినిమా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ హైదరాబాద్‌లో విక్టరీ వేడుకను ఘనంగా నిర్వహించింది.
Details
ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు
ఈ వేడుకకు ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డైరెక్టర్లు హరీష్ శంకర్, వశిష్ట, వంశీ పైడిపల్లి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని, ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్పారు.
'సంక్రాంతికి వస్తున్నాం'ని సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉందని, ఓ మంచి దేవుడా.. నేను అడగకుండానే 'కలియుగ పాండవులు' ఇచ్చావు. ఎన్నో హిట్ సినిమాలు నాకు అందించావు.
'చంటి'తో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చావు (నవ్వుతూ). 'ప్రేమించుకుందాం రా', 'బొబ్బిలి రాజా', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గణేష్', 'లక్ష్మీ', 'తులసి', 'రాజా'... ఇలా ఎన్నో హిట్స్ ఇచ్చావు.
Details
వెంకటేష్ నటన అద్భుతం : రాఘవేంద్రరావు
2000లో 'కలిసుందాం రా'తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చావు. ఇప్పుడు 2025లో మళ్లీ ఎలాంటి ఆశించకుండానే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చావు. ఇది కలా, నిజమా తెలియడం లేదు! ప్రేక్షకుల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైంది.
అందరికీ థాంక్స్! అని అన్నారు. తమ గురువు రాఘవేంద్రరావు ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తీసి పెద్ద హిట్ అవ్వాలని చెప్పారని, ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైందన్నారు.
పదేళ్లుగా సినిమా చూడని ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చి చూసి ఎంజాయ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, . దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
2027లో మళ్లీ సంక్రాంతికి వస్తామని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు.