LOADING...
Tollywood: కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. చిరంజీవిని కలవనున్న నాయకులు
కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. చిరంజీవిని కలవనున్న నాయకులు

Tollywood: కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె.. చిరంజీవిని కలవనున్న నాయకులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లోని సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు 15వ రోజుకు చేరింది. సమ్మె కారణంగా అన్ని షూటింగ్స్ పూర్తిగా ఆగిపోయాయి. దాంతో సగటు కార్మికులు సమస్యలతో విలవిలలాడుతున్నారు. సమస్యలు పరిష్కరించడంలో నిర్మాతలతో చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ నాయకులు ఒకవైపు చర్చలు కొనసాగిస్తూ, మరోవైపు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మెగాస్టార్ చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు కలవనున్నారు. అంతకుముందు, మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరుగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై చిరంజీవితో చర్చించారు. అంతే కాక, చిన్న నిర్మాతల బృందం కూడా చిరంజీవిని కలుసుకొని సినిమాల సమస్యలను వివరించింది.

Details

రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాలి

సమాచారం ప్రకారం, మంగళవారం సినిమా నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో కలిసి చిరంజీవి సమావేశం జరగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మంగళవారం నాడు, కృష్ణానగర్‌లో సినీ కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణలను ఫెడరేషన్ నాయకులు ప్రకటించనున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిరసనలో ముఖ్యంగా, నిర్మాతల నుంచి రూ.13కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ సభ్యులు నిరంతరం వచ్చే కష్టాన్ని నిర్మాతలు గుర్తించాలని అభ్యర్థించారు. ప్రస్తుతం, నిర్మాతలు సెట్ చేసిన నాలుగు కండిషన్లలో రెండు కండిషన్ల వల్ల చర్చలుఆగిపోయాయి. ఈ పరిస్థితి కారణంగా నిర్మాతల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ, సినీ కార్మిక సంఘాలు కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.