LOADING...
Urvashi Rautela: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు

Urvashi Rautela: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు ఊర్వశి రౌతేలా హాజరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈనెల 15న ఆమెకు ఈడీ సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు బెట్టింగ్ యాప్‌లకు ఆమె చేసిన ప్రచారం వాటితో సంబంధం, పొందిన పేమెంట్స్ తదితర అంశాలపై ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఇతర సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా విచారణకు హాజరైనట్లు తెలిసింది. మంచు లక్ష్మి, సురేశ్ రైనా, రానా, సోనూ సూద్ ఇటీవల ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.