
Prabhas: ఓపెన్ షర్ట్, కూల్ గ్లాసెస్.. ప్రభాస్ వింటేజ్ లుక్‌కు అభిమానుల ఫిదా
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఘన విజయం సాధించిన క్లాసిక్ మూవీ 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు, చిత్రబృందం అందరూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ మరో హైలైట్ కు కారణమయ్యాడు తాజా స్టైలిష్ లుక్‌తో మరోసారి అభిమానుల మనసు గెలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'ది రాజా సాబ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రారంభం నుండి అనుసంధానమైన మాస్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ (SKN) , తాజా సెట్స్ నుంచి ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Details
ఆసక్తి రేపుతున్న ఎస్కేయన్ వ్యాఖ్యలు
ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోలో ప్రభాస్ ఓ వింటేజ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఓపెన్ షర్ట్, కూల్ గ్లాసెస్, లైట్ బీట్ క్రాఫ్ట్ గెటప్‌తో ఆయన యూత్‌ఫుల్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచాడు. చాలా కాలం తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి మాస్-క్లాస్ కాంబినేషన్‌లో చూడడం అభిమానులందరినీ ఉత్సాహానికి గురిచేసింది. ఈ సందర్భంగా SKN వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపాయి. ఇది కేవలం బర్త్‌డే మూమెంట్ కాదు, రాబోయే విజయానికి తొలి సంకేతం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోని సన్నివేశాలు మెస్మరైజ్ చేయడమే కాదు, సినిమా విజయం పట్ల గ్యారంటీ ఇచ్చేలా ఉన్నాయని SKN చెప్పాడు.