
Operation valentine: సైలెంట్‌గా ఓటిటిలోకి వచ్చేసిన 'ఆపరేషన్ వాలెంటైన్'
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం "ఆపరేషన్ వాలెంటైన్".
తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని భారతీయ వైమానిక దళం,పోరాట కార్యకలాపాల గురించి ఈ సినిమాలో చూపించారు.
ఇప్పుడు ఈ భారీ యాక్షన్ డ్రామా 'ఆపరేషన్ వాలెంటైన్' సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈనెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రాగా..ఈరోజు అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది.
కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
నవదీప్, రుహాని శర్మ,మీర్ సర్వర్ కీలకపాత్రలలో నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రైమ్ వీడియో చేసిన ట్వీట్
they risked it all to honour the fallen, witness the operation come alive!#OperationValentineOnPrime, watch nowhttps://t.co/4AlFuYMpRi pic.twitter.com/aOoAv4lHQa
— prime video IN (@PrimeVideoIN) March 22, 2024