Page Loader
Operation Valentine Review: ఆకట్టుకున్న వైమానిక పోరాటం, వైమానిక దాడులు  
Operation Valentine Review: ఆకట్టుకున్న వైమానిక పోరాటం, వైమానిక దాడులు

Operation Valentine Review: ఆకట్టుకున్న వైమానిక పోరాటం, వైమానిక దాడులు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 01, 2024
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం "ఆపరేషన్ వాలెంటైన్". తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని భారతీయ వైమానిక దళం,పోరాట కార్యకలాపాల గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

Story

సినిమా కథ ఏంటంటే..

అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) అతని భార్య అహనా గిల్ (మానుషి చిల్లర్) భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ హోదాలో ఉంటారు. అర్జున్ ఒక టెస్ట్ పైలట్, అతను సైనిక విమానాలను ఇతర సైనికులు ఉపయోగించే ముందు పరిక్షిస్తుంటాడు. అర్జున్ ప్రాజెక్ట్ వజ్రను రూపొందిస్తాడు. శత్రువు రాడార్ ద్వారా గుర్తించబడకుండా ఉండటానికి భూమికి దగ్గరగా ఎగురుతూ ఉండే వ్యూహమే ప్రాజెక్ట్ వజ్ర. ఈ ప్రాజెక్ట్ కోసం రుద్ర చేసిన సాహ‌సం కార‌ణంగా అత‌డి స్నేహితుడు క‌బీర్ (న‌వ‌దీప్‌) మ‌ర‌ణిస్తాడు.

Details 

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి 

ప్రాజెక్ట్ వ‌జ్ర‌ను అధికారులు బ్యాన్ చేస్తారు. ఆ సంఘ‌ట‌న పర్యవసానంగా భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్‌లో పనిచేయడం మానుకోవాలని,లేదంటే విడిపోవాల్సి వస్తుందని అహానా అర్జున్‌తో చెబుతుంది. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడులలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత, భారత ప్రభుత్వం, భారత వైమానిక దళం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి ?, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి ?, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య , కమాండర్ అహ్న ( మానుషి చిల్లర్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

Details 

ఎవరెలా చేశారంటే.. 

ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు. తెరపై నిజమైన వింగ్‌ కమాండర్‌గానే కనిపించాడు. ఎమోషనల్ సీక్వెన్స్‌లో నటనతో ఆకట్టుకున్నాడు. మరో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ అద్భుతంగా నటించింది. అయితే, హీరోహీరోయిన్ల మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదు. నవదీప్ అతిధి పాత్రలో నటించాడు. మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

Details 

సాంకేతిక విభాగం 

ముహరి వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ, ముఖ్యంగా వైమానిక పోరాటం, వైమానిక దాడులు చాలా ఆకట్టుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చక్కగా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం పర్వాలేదు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. నిర్మాతలు సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.