
Oscar 2026: 2026 ఆస్కార్ వేడుకలపై పూర్తి వివరాలు.. ఈసారి ఏఐ చిత్రాలకు కూడా అవార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ప్రపంచంలో అత్యంత గౌరవనీయంగా భావించే ఆస్కార్ అవార్డుల 98వ వేడుకపై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 మార్చి 15న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించనున్నారు.
కొత్త నిబంధనలు-ఓటింగ్ విధానంలో మార్పులు
ఈసారి ఆస్కార్ అవార్డుల ఎంపిక విధానంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆస్కార్ రేసులో పాల్గొనబోయే చిత్రాల నామినేషన్ జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నారు.
కొంతమంది సభ్యులకు ఓటింగ్ విధానంలో మార్పులు చేసినట్లు అకాడమీ తెలిపింది.నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని సభ్యులు తప్పకుండా చూడాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇది న్యాయమైన నిర్ణయాల కోసం తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు.
వివరాలు
'అచీవ్‌మెంట్ ఇన్ కాస్టింగ్' - కొత్త అవార్డ్ కేటగిరీ
ఈ ఏడాది ప్రత్యేకంగా "అచీవ్‌మెంట్ ఇన్ కాస్టింగ్" అనే కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టినట్లు అకాడమీ ప్రకటించింది.
ఈ కేటగిరీలో విజేతను ఎంపిక చేసే ప్రక్రియ రెండు దశలుగా సాగనుంది. ఫైనల్ ఓటింగ్‌కు ముందు కాస్టింగ్ డైరెక్టర్లపై కొన్ని రౌండ్ల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏఐ ఆధారిత సినిమాలకు కూడా అవకాశం
సినిమా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న అకాడమీ, ఈసారి ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలను కూడా ఆస్కార్ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోనుంది.
అయితే ఈ సినిమాలు సాధారణ చిత్రాలపై ప్రభావం చూపవు, మానవ మెదడుతో రూపొందించిన సినిమాలకు మొదట ప్రాధాన్యం ఇచ్చే విధంగా తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.
వివరాలు
వేదిక - డాల్బీ థియేటర్, లాస్ ఏంజెల్స్
ఈ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య విడుదలైన చిత్రాలు ఈ ఆస్కార్ పోటీకి అర్హులవుతాయి.
అయితే మ్యూజిక్ కేటగిరీలో మాత్రం చివరి తేదీని 2025 అక్టోబర్ 15గా నిర్ణయించారు.
స్టంట్ డిజైన్ కేటగిరీ - 2027 నుండి ప్రారంభం
ఇంతకుముందే అకాడమీ అధికారికంగా ప్రకటించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, 2027 నుంచి విడుదలయ్యే చిత్రాలకు 'స్టంట్ డిజైన్' అనే ప్రత్యేక విభాగంలో కూడా అవార్డులు అందించనున్నట్లు తెలిపింది.
స్టంట్ కూర్పులో నైపుణ్యం చూపినవారికి గుర్తింపివ్వాలన్న ఉద్దేశంతో ఈ కొత్త కేటగిరీని ప్రారంభించనున్నారు.