LOADING...
Kamaal R Khan: ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు
ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు

Kamaal R Khan: ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం విచారణ నిమిత్తం పిలిపించిన పోలీసులు, అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.

Details

అసలేం జరిగిందంటే..

ఈ వారం ప్రారంభంలో ముంబైలోని నలంద సొసైటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో అపార్ట్‌మెంట్‌ నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అవి రెండో, నాలుగో అంతస్తుల్లో లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

Details

విచారణలో కీలక అంశాలు

ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సాయంత్రం కమల్ ఆర్ ఖాన్‌ను ఓషివారా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణలో లైసెన్స్ పొందిన తుపాకీతో తానే కాల్పులు జరిపినట్లు ఆయన అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. నలంద సొసైటీలోని ఒక ఫ్లాట్ రచయిత-దర్శకుడికి చెందినదిగా, మరో ఫ్లాట్ ఒక మోడల్‌కు సంబంధించినదిగా సమాచారం. అయితే కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకుందన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

Advertisement

Details

కస్టడీ కోరే అవకాశం

సీసీటీవీ ఫుటేజ్‌లో ఇప్పటివరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సహాయంతో కమల్ ఆర్ ఖాన్ బంగ్లా వైపు నుంచి బుల్లెట్లు పేలి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా వెల్లడికాకపోవడంతో, నేడు కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement