Page Loader
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2024
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తుంటాయి. ఈ వారం ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. ఈగిల్: రవితేజ (Raviteja) హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఈగల్‌' (Eagle).ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్‌,కావ్య థాపర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. లాల్‌ సలామ్‌: ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.రజనీకాంత్‌ (Rajinikanth)హీరోగా నటిస్తున్నఈచిత్రాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. హీరోలుగా,విష్ణు విశాల్‌,విక్రాంత్‌ నటించారు.భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు.

Details 

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

రీరిలీజ్ కి సిద్దమైన కెమెరామెన్‌ గంగతో రాంబాబు: పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan),పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ మూవీ 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ట్రూ లవర్: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'ట్రూ లవర్'. ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకుడు. ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Details 

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు 

నెట్‌ఫ్లిక్స్ లో: డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ - ఫిబ్రవరి 05 ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ - ఫిబ్రవరి 05 మాంక్ సీజన్స్- ఫిబ్రవరి 05 మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్-ఫిబ్రవరి 05 ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్-ఫిబ్రవరి 05 లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ - ఫిబ్రవరి 07 రైల్: ది లాస్ట్ ప్రొఫెట్- ఫిబ్రవరి 07 లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 వన్ డే- ఫిబ్రవరి 08 గుంటూరు కారం- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్) ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ - ఫిబ్రవరి 09 యాషెస్-ఫిబ్రవరి 09

Details 

ఇతర ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు

అమెజాన్ ప్రైమ్ లో .. కెప్టెన్ మిల్లర్ -ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో .. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3- ఫిబ్రవరి-0 9 జీ5 లో .. కాటేరా- ఫిబ్రవరి- 09