
Anurag Kashyap: లాభాల కోసం కళను తాకట్టు పెట్టిన ఓటీటీ వేదికలు : అనురాగ్ కశ్యప్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు వంటి స్ట్రీమింగ్ వేదికలపై విమర్శలు గుప్పించిన ఆయన... ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటెంట్ భారతీయ టెలివిజన్, ముఖ్యంగా న్యూస్ ఛానెళ్ల కంటే కూడా దిగజారిందని పేర్కొన్నారు.
వీటి ప్రధాన దృష్టి కేవలం సబ్‌స్క్రిప్షన్‌లు పెంచుకోవడంపైనే ఉందని, కళాత్మకత, కొత్తదనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అనురాగ్ కశ్యప్ అభిప్రాయం ప్రకారం, ఓటిటి వేదికలు ఒకప్పుడు కొత్త కథలు చెప్పేందుకు, వినూత్న ప్రాజెక్టులు తీసేందుకు బంగారు అవకాశంగా నిలిచాయని గుర్తు చేశారు
Details
ఓటిటి దిగజారిపోయింది
. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి తీయబడిన 'సేక్రెడ్ గేమ్స్', 'లస్ట్ స్టోరీస్' వంటి ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.
అయితే ఇప్పుడు ఆ వేదికలు ఖచ్చితంగా ప్రజాదరణ పొందేలా, ఏ ఒక్క వర్గానికీ అభ్యంతరం రానీయకుండా కంటెంట్‌ను తయారుచేస్తుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి అల్గారిథం ఆధారిత దృక్పథం వల్ల క్రియేటివిటీ, కంటెంట్ నాణ్యత బలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
టెలివిజన్ కంటెంట్‌కి ఉన్న స్థాయిని కూడా దాటి ఓటీటీ దిగజారిపోయిందని విమర్శించారు.
అనురాగ్ వ్యాఖ్యలు కేవలం హిందీ పరిశ్రమకే పరిమితమవకుండా, తెలుగు సహా ఇతర భాషల్లోనూ ఓటీటీ కంటెంట్ నాణ్యతపై చర్చకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.