Loading...
Ranabaali OTT Release Date: రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ranabaali OTT Release Date: రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన క్రేజీ మూవీ 'రణబాలి' ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి రాబోతోంది. థియేటర్లలో సినిమా చూడటం మిస్సయిన వారితో పాటు, ఇంట్లోనే హాయిగా సినిమాను ఆస్వాదించాలనుకునే సినీ ప్రియులకు ఇది గుడ్‌న్యూస్. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 13 నుంచి 'రణబాలి' స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది. దీంతో ఐదు భాషల ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించే అవకాశం కలగనుంది.

వివరాలు

బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ADVERTISEMENT