
ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్టు ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష, మే 21నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుంది.
థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఓటిటి వైపు అడుగులు వేస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ఏజెంట్
అక్కినేని అఖిల్ కెరీర్లో మరో డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 19నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనుంది.
Details
పనసకాయ దొంగలను పట్టుకునే కథ
కథల్ - ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
సానియా మల్హోత్రా, విజయ్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని యశోవర్ధన్ డైరెక్ట్ చేసారు. మే 19నుండి నెట్ ఫ్లిక్స్ లో హిందీలో అందుబాటులో ఉంటుంది.
కథల్ కథ
ఒక రాజకీయ నాయకుడి తోటలో రెండు పనసకాయలు దొంగిలించబడతాయి. వాటిని ఎవరు దొంగిలించారో కనుక్కునేందుకు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది.
డెడ్ పిక్సెల్స్:
మెగా డాటర్ నీహారిక నటించిన ఈ సిరీస్ లో మొబైల్ మొబైల్ గేమ్స్ వ్యసనం గురించి చూపించబోతున్నారు.
మే 19నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది. వైవా హర్ష అక్షయ్ లింగస్వామి, సాయి రోనాక్ కీలక పాత్రల్లో నటించారు.