LOADING...
Anaganaga Oka Raju: 'మా రాజు గారు వస్తున్నారు'.. ట్రైలర్‌కు కౌంటడౌన్ స్టార్ట్
'మా రాజు గారు వస్తున్నారు'.. ట్రైలర్‌కు కౌంటడౌన్ స్టార్ట్

Anaganaga Oka Raju: 'మా రాజు గారు వస్తున్నారు'.. ట్రైలర్‌కు కౌంటడౌన్ స్టార్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'అనగా ఒక రాజు' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తారని మేకర్స్‌ తెలిపారు. ఇందులో మీనాక్షి చౌదరి ఫీమ్‌లీడ్ రోల్‌లో నటిస్తోంది. చిత్ర ప్రచారం వేగం పెంచడం కోసం మేకర్స్‌ ట్రైలర్ అప్‌డేట్‌తో పాటు కొత్త పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టర్‌లో నవీన్ పొలిశెట్టి ఊయలపై కింగ్ స్టైల్‌లో స్టైలిష్‌గా కూర్చున్న లుక్‌లో కనిపిస్తున్నాడు.

Details

నవీన్ పొలిశెట్టి సింగర్‌గా పరిచయం

మా రాజు గారు వస్తున్నారు.. దరువేసుకోండ్ర అంటూ చిత్రబృందం స్లోగన్ పెట్టడం, ఈ సంక్రాంతి ఇంటింటా నవ్వుల మోతె" అని చెబుతూ టైలర్ జనవరి 7 సాయంత్రం 6 గంటలకు లాంచ్ అవుతుందని ప్రకటించారు. ఈ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సింగర్‌గా కూడా డెబ్యూ చేయబోతున్నాడు. ఆయన భీమవరం బల్మా పాటను పాడారు. పండగకు స్టెప్పులు వేయడానికి అభిమానులు రెడీగా ఉండాలని చిత్రబృందం కోరుతోంది.

Details

తయారీ, నిర్మాణం, సంగీతం 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో-ప్రొడ్యూస్ చేస్తుంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్ వీడియో హైలైట్స్ చిత్రానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ వీడియోలో రాజుగారి పెళ్లి విందులో చమ్మక్‌ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి... గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి అంటూ డైలాగ్‌లతో ప్రారంభమవుతుంది. అతిథుల్లో ఒకరు 'ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్... స్వీటు గోల్డ్ అంటున్నారు?' అని అడిగితే, మరొకరు ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని వివరిస్తారు.

Advertisement

Details

సినిమాపై భారీ అంచనాలు

వీడియోలో నవీన్ పొలిశెట్టి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్‌ను చూస్తూ, ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి, సెలబ్రిటీ ఫోన్ నంబర్లు ఇస్తానని చెప్పడం, ఆ ఇయర్ అంతా అంబానీ పెళ్లి... వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటూ కామెడీ టచ్ చూపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. జాతి రత్నాలు హీరో స్టైల్‌ ఆఫ్ హ్యూమర్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను నవ్వుల తాన్నే అందించబోతోంది.

Advertisement