Prabhas: మా సినిమా ఆగలేదు.. అధికారిక ప్రకటన కోసం చూస్తున్నాం
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న లైనప్‌ను చూస్తే దేశవ్యాప్తంగా మరే హీరోకీ లేనంత భారీ ప్రణాళిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని అనంతరం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇవే కాకుండా 'కల్కి 2', 'సలార్ 2' చిత్రాలు కూడా ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి.
Details
మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
. కల్కి సీక్వెల్‌గా 'కల్కి 2', అలాగే సాలర్‌కు కొనసాగింపుగా 'సలార్ 2' చిత్రాలు తెరకెక్కనున్నాయి. ఈ రెండు సీక్వెల్స్‌తో పాటు మరో క్రేజీ ప్రాజెక్టును కూడా ప్రభాస్ ఇప్పటికే ఆమోదించారు. అది 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ చేయనున్న చిత్రం. హనుమన్ విడుదల సమయంలోనే ప్రశాంత్ వర్మ ఒక కథను ప్రభాస్‌కు వినిపించగా, ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత పురాణాల్లోని కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, ప్రశాంత్ వర్మ వరుస సినిమాలను అంగీకరించడం కారణమనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Details
మా సినిమాపై అధికారిక ప్రకటన చేస్తాం
ఈ ప్రచారంపై మేకర్స్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక మా సినిమాపై అధికారిక ప్రకటన చేస్తాం. సరైన సమయాన్ని ఎదురుచూస్తున్నామని వారు తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందనే ప్రచారానికి చెక్ పడింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం రిషబ్ శెట్టి 'జై హనుమాన్' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.