P.Susheela birthday: స్వర కోకిల సుశీల.. ఆమె పాటు తేనె ఊట
పరిచయం అక్కర్లేని పేరు దిగ్గజ గాయని పి.సుశీల. ఆమె పాటు తేనె ఊట లాంటింది. ఆమె పాడితే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. తన మధుర గాత్రంతో సౌత్ సినిమా ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఓలలాడించారు. ఆమె గొంతులోని మాధుర్యం గురించి ఎంత చెప్పినా.. తక్కువే అవుతుంది. సోమవారం(నవంబర్-13) పి.సుశీల పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలను చెప్పుకుందాం. పి.సుశీల విజయనగరంలో 1935లో జన్మించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. 1950లో పి.సుశీల సనీ ప్రస్థానం మొదలైంది. ఇదే ఏడాది ఏఎమ్ రాజాతో కలిసి పెట్ర తాయ్ సినిమాలో సుశీల తన మొదటి పాటను పాడారు. ఈ సినిమా తెలుగులో కన్నతల్లి పేరుతో విడుదలైంది.
50 వేలకు పైగా పాటలు
దాదాపు 6 దశాబ్దాల పాటు పి.సుశీల సింగర్‌గా రాణించారు. సినిమా, ఆధ్యాత్మికం లాంటి అన్ని రకాలుగు కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. సుశీల ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో పాడారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషల్లో తన పాటల ద్వారా అలరించారు. ప్లేబ్యాక్ సింగర్‌గా 5జాతీయ పురస్కారాలు, ప్రాంతీయ, పలు రాష్ట్రాల ప్రభుత్వాల అవార్డులను కూడా సుశీల అందుకున్నారు. పి.సుశీల డాక్టర్ మోహనరావును వివాహం చేసుకున్నారు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. 1960 నుంచి 1990 వరకు సుశీల దక్షిణాదిన మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా అగ్రపథాన దూసుకుపోయారు.