
Pallavi Prashanth : పరారీలో రైతు బిడ్డ.. క్లారిటీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్
ఈ వార్తాకథనం ఏంటి
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ విన్నర్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
ఇప్పటికే అతని మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చేశారు.
ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ బయటికి వస్తున్న సమయంలో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, బోలే కార్ల అద్దాలు పగలకొట్టి వారిని అసభ్య పదజాలతో దూషించారు.
ప్రశాంత్ కూడా పోలీసుల మాట వినకుండా ఊరేగింపుగా వెళ్లడంతో అతని ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు.
ఈ మొత్తం ఘటనలో కొన్ని పోలీసుల వాహనాలు, ప్రయివేటు వాహనాలు, గవర్నమెంట్ బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి.
Details
పారిపోలేదన్న పల్లవి ప్రశాంత్
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రశాంత్ A1 గా, అతని తమ్ముడిని A2గా చేర్చారు.
ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. దీంతో పలు మీడియా సంస్థలు ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపాయి.
దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ ఓ వీడియో షేర్ చేశాడు. తాను ఎక్కడికి వెళ్లిపోలేదని, తన మీద నెగిటివ్ ప్రచారాన్ని ఆపాలని కోరారు.
మరి ఈ కేసులో ప్రశాంత్ ని అరెస్టు చేస్తారా లేదో వేచి చూడాలి.