తదుపరి వార్తా కథనం

పాపం పసివాడు ట్రైలర్: ఆహా నుండి వచ్చేస్తున్న కొత్త సిరీస్
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 24, 2023
01:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తున్న పాపం పసివాడు వెబ్ సిరీస్ ఆదివారం ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ తో సింగర్ శ్రీరామ్ చంద్ర హీరోగా మారాడు. సెప్టెంబర్ 29 నుండి ఆహాలో పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
గాయత్రి చాగంటి, శ్రీ విద్య మహర్షి, రాశీ సింగ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రం, పెళ్ళిపై యువకుడిలో ఉండే కన్ఫ్యూజన్ ని చూపించారు.
ఒకేసారి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను ఇష్టపడటంతో ఆ యువకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది పాపం పసివాడు కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ద వీకెండ్ షో బ్యానర్ లో రూపొందిన ఈ సిరీస్ లలిత్ కుమార్ తెరకెక్కించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆహా ట్వీట్
Papam Pasivadu...
— ahavideoin (@ahavideoIN) September 24, 2023
Trailer vadiladu..🎬
Iga hungama shuru😉
Confuse kakunda clarity ga chuseyyandi..!😝#PapamPasivadu Premieres Sept 29 pic.twitter.com/9Cikes0WO3