LOADING...
Varun Tej- Lavanya Tripathi: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట్లో సంబరాలు!
తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట్లో సంబరాలు!

Varun Tej- Lavanya Tripathi: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట్లో సంబరాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో ఒకరు. కొన్నేళ్లు సీక్రెట్‌గా ప్రేమలో మునిగిపోయిన వీరు, ఆ తరువాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2023 నవంబర్ 1న వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట, ఒక్కసారిగా నిశ్చితార్థం వార్తను ప్రకటించి, అనంతరం పెళ్లి చేసుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్' చిత్రంలో తొలిసారిగా వరుణ్-లావణ్య జంటగా కనిపించారు. ఆ తరువాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన 'అంతరిక్షం' సినిమా చేశారు.

Details

రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జననం

ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే చాలా కాలం తమ ప్రేమను బయట పెట్టలేదు. ఇటీవల ఈ జంట ఒక గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. జీవితంలో కొత్త బాధ్యత రాబోతోందని వరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించగా, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ మెగా అభిమానులు సంబరాలు జరిపారు. ఆ అంచనాలు నిజమయ్యాయి. ఈ రోజు ఉదయం లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Details

ఇటీవల సినిమాలను తగ్గించిన లావణ్య త్రిపాఠి

సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి తన సినిమా శంకర వ‌రప్ర‌సాద్ షూటింగ్ లొకేషన్ నుండి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలను కలసి అభినందనలు తెలిపారు. మెగా వారసుడు రాకతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సినిమాల విషయానికి వస్తే, లావణ్య త్రిపాఠి ఇటీవల సినిమాలను తగ్గించారు. వరుణ్ తేజ్ మాత్రం 2023లో గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ప్రస్తుతం వరుణ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో VT-15 (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.