
పరిణీతి చోప్రా, రాఘవ చడ్డా వెడ్డింగ్: వైరల్ అవుతున్న సంగీత్ ఫోటోలు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చడ్డాల వివాహ వేడుకకు ఉదయపూర్ లోని లీలా ప్యాలస్ వేదికయ్యింది.
పెళ్ళితో వీరిద్దరూ ఈరోజు ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం సంగీత్ పార్టీ సంబరంగా జరిగింది.
ప్రస్తుతం పరిణీతి చోప్రా, రాఘవ్ చడ్డాల సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
సంగీత్ పార్టీలో రాఘవ్ చడ్డా బ్లాక్ సూట్ లో మెరిసిపోతుండగా, పరిణీతి చోప్రా చమ్కీ డ్రెస్ లో అందంగా కనిపించింది. పెద్దగా ఆభరణాలు ధరించకుండ సింపుల్ గా పరిణీతి లుక్ ఉంది.
ఈ సంగీత్ పార్టీలో అత్యంత సన్నిహితులు, దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.
Details
సంగీత్ పార్టీ కోసం ప్లే లిస్ట్ రూపొందించిన పరిణీతి చోప్రా
సంగీత్ పార్టీ మొత్తం 1990 కాలం నాటి బాలీవుడ్ పాటలతో మార్మోగిపోయినట్లు ఇండియా టుడే కథనాలు రాసుకొచ్చింది.
సంగీత్ పార్టీ కోసం పాటల ప్లే లిస్టును పరిణీతి చోప్రా రూపొందించారని అంటున్నారు. అలాగే సంగీత్ పార్టీకి వచ్చిన వారికి ఒకానొక క్యాసెట్ బహుకరించారట. ఆ క్యాసెట్ మీద పరిణీతి చోప్రా స్వయంగా మెసేజ్ రాశారట.
ఇక ఫుడ్ విషయానికి వస్తే.. చాట్, పాప్ కాన్, మ్యాగీ వంటి పలు రకాల వెరైటీలను ప్రిపేర్ చేశారట.
పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, పెళ్లికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్, సానియా మీర్జా ఈరోజు మధ్యాహ్నం ఉదయపూర్ చేరుకోనున్నారని సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సంగీత్‌లో సందడి
Parineeti Chopra-Raghav Chadha Wedding: Inside Video From Couple's Desi Sangeet Goes Viral#ParineetiRaghavWedding #ParineetiChopra #RaghavChadha #India #Bollywood #Viral @ParineetiChopra @raghav_chadha pic.twitter.com/Df5mVLfbg1
— Free Press Journal (@fpjindia) September 24, 2023