Parthiban: పార్థిబన్ సంచలన నిర్ణయం.. 'నో కాస్ట్-నో రిలీజియన్' సర్టిఫికెట్‌కు అప్లై
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు, దర్శకుడు పార్థిబన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయగా, ఇప్పుడు ఆ వివాదానికి ముగింపు పలికే దిశగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు కులం, మతం లేవని తెలియజేస్తూ 'నో కాస్ట్ - నో రిలీజియన్ సర్టిఫికెట్' కోసం అధికారికంగా దరఖాస్తు చేశారు.
వివరాలు
అసలు వివాదం ఏమిటి?
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన పార్థిబన్, ఈవెంట్‌లో తనను పరిచయం చేసుకునే సమయంలో తన సామాజిక వర్గం (కులం) పేరును ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మేధావిగా పేరున్న ఆయన ఇలా కులం ప్రస్తావించడం సరైందా అని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు.
వివరాలు
పార్థిబన్ వివరణ
ఈ వివాదంపై స్పందిస్తూ పార్థిబన్ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "నేను కులమతాలను అస్సలు పట్టించుకోను. వేదికపై నా మాతృభాష తెలుగని చెప్పబోయి, పొరపాటున కులం పేరును వాడాను. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని ఆయన స్పష్టం చేశారు. నెటిజన్ల విమర్శలు తనను బాధించాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కులం, మతం లేవని అధికారికంగా ధృవీకరించే సర్టిఫికెట్ కూడా ఉంటుందని ఇప్పుడు తెలిసిందని, వెంటనే దానికి అప్లై చేశానని వెల్లడించారు. ఈ సర్టిఫికెట్‌ను పొందిన తొలి సినీ నటుడిగా నిలుస్తాను. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కులమతాలకు అతీతమైన సమాజం కోసం దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తానని పార్థిబన్ ప్రకటించారు.